PEDDI: భారీ ధరకి పెద్ది ఆడియో రైట్స్ సేల్ 3 d ago

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం “పెద్ది”. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సాలిడ్ హైప్ అందుకుంది. అయితే పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోయినట్టుగా ఓ టాక్ నడుస్తోంది. దీంతో పెద్ది పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులు టీ సిరీస్ వారు ఏకంగా రూ.35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. ఇక అవైటెడ్ గ్లింప్స్ ఈ ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కానుకగా రాబోతుంది.